Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: నటి నగ్మా

హీరోయిన్ భావనపై జరిగిన అత్యాచార ఘటన పట్ల తానేమీ ఆశ్చర్యపోవడం లేదని నటి నగ్మా చెప్పింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచం మొత్తం ఉందని... హాలీవుడ్ లో సైతం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపింది. మన దేశ సినిమా రంగానికి కూడా ఇలాంటి వేధింపులు కొత్త కాదని... దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్క మహిళ తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు వేధింపులకు గురవుతోందని చెప్పింది.

తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని నగ్మా చెప్పింది. అయితే, తాను ఇప్పటి వరకు బయటకు చెప్పుకోలేదని... వరలక్ష్మి మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, విషయాన్ని బయటకు చెప్పిందని ప్రశంసించింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ రాజకీయ నాయకుడు, నటుడు కావడంతో... ఆమె ధైర్యంగా బయటకు చెప్పగలిగిందని తెలిపింది. కానీ, చాలా మంది ఇలాంటి అఘాయిత్యాలపై మాట్లాడటానికి భయపడుతున్నారని చెప్పింది.

More Telugu News